విశాఖ స్టీల్ ప్లాంట్ పై జ‌న‌సేన నానాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ పై జనసేన సీనియర్ నేత పంతం నానాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తూ.గో జిల్లా రైతులు సంఘీభావం తెలుపుతున్నామ‌ని పేర్కొన్న ఆయ‌న‌… విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే ఏలేరు కాల్వ గేట్లు మూసేస్తామ‌ని హెచ్చ‌రించారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే గతంలో మేం ప్రభుత్వం ఎంతిస్తే…అంత పరిహరం తీసుకుని భూములిచ్చామ‌న్నారు పంతం నానీజీ. మాకు తాగు, సాగు నీరుతో ఇబ్బందున్నా.. స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశామ‌ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే మా నీటిని విశాఖ ప్రజలకిస్తాం కానీ.. స్టీల్ ప్లాంటుకు ఇవ్వబోమ‌ని స్ప‌ష్టం చేశారు. రోజుకు 300 క్యూసెక్కుల నీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సరఫరా అవుతోందని…ఆ నీటిని ఆపేస్తే మా జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని స్ప‌ష్టం చేశారు పంతం నానాజీ. దీని పై కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గాల‌న్నారు నానాజీ.

Read more RELATED
Recommended to you

Latest news