ఆర్‌బీఐలో ఇంట‌ర్న్‌షిప్‌.. రూ.20,000 స్టైఫండ్‌ నెలకి..!

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్ధులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్‌బీఐలో విద్యార్థుల‌కు, గ్రాడ్యుయేట్ ఫ్రెష‌ర్ల‌కు వార్షిక వేసవి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఫైనాన్స్, ఎకనామిక్స్, లా, బ్యాంకింగ్‌లలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోచ్చు.

 

డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. కనుక ఈ లోగా ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైఫండ్ అందజేస్తారు. శిక్షణ తీసుకున్నవారు ముంబై కి మరియు తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులను భరించాలి.

వారి వసతి ఏర్పాట్లను కూడా వారే స్వయంగా చూసుకోవాలి. విద్యార్హతల వివరాలలోకి వెళితే.. మేనేజ్‌మెంట్, కామర్స్, స్టాటిస్టిక్స్, లా, ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్ లేదా భారతదేశంలోని ప్రముఖ కళాశాలలు, సంస్థల నుంచి న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తి-సమయం ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీలో సమగ్ర ఐదేళ్ల లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించి ఉండాలి.

విదేశీ విద్యార్థులు కూడా అర్హులే. వివరాలని చూసి అర్హులైతే అప్లై చేసుకోచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే.. ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు అర్హ‌త ఉన్న భార‌తీయ‌ విద్యార్థులు ఆన్‌లైన్ వెబ్ ఆధారిత దరఖాస్తు ఫారం నింపాలి. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.

అడ్ర‌స్‌: చీఫ్ జనరల్ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ డివిజన్), సెంట్రల్ ఆఫీస్, 21వ అంతస్తు, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, షాహిద్ భగత్ సింగ్ రోడ్, ముంబై – 400 001

 

Read more RELATED
Recommended to you

Latest news