తబ్లిగీ జమాత్ పై సౌదీ అరేబియా నిషేధం..

-

తబ్లిగీ జమాత్ ఈ పేరు తెలియనివారు దాదాపుగా ఇండియాలో ఉండరు.. దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో ఈ పేరు బాగా తెలిసింది. ఇస్లామిక్ సంస్థ తబ్లిగీ జమాత్ పై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటింిచింది. తబ్లిగీ జమాత్ తో ప్రజలకు, సమాజానికి ముప్పు పొంచి ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ విషయాన్ని మసీదులకు తెలియజేయాలని… ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాగా.. 1926లో ప్రారంభమైన ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 30-35 కోట్ల మంది ముస్లింలు తబ్లిగీని అనుసరిస్తున్నట్లు సమాచారం ఉంది. తబ్లిఘి జమాత్, సున్నీ ఇస్లాం అనుసరించడానికి ముస్లింలను ప్రోత్సహించే అంతర్జాతీయ సున్నీ ఇస్లామిక్ మిషనరీ ఉద్యమం.

అయితే కరోనా ప్రారంభం సమయంలో రెండేళ్ల క్రితం ఢిల్లీలో తబ్లిగీ సమావేశం జరిగింది. దీనికి దేశవిదేశాల నుంచి అనేకమంది తబ్లిగీలు ఢిల్లీకి వచ్చారు. ఈ సమయంలో చాలా మందికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమై చర్యలు తీసుకుంది. కరోనాకు కారణం కావడంతో తబ్లిగీలపై భారత ప్రభుత్వం చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news