అమరావతి : నేడు విజయవాడ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో విమానంలో విజయవాడ కు చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా అట్టహాసంగా జరుగనున్నాయి.
ఈ నేపథ్యం లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కు రానున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిన అనంతరం… పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఈ పార్టీ నేతల సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వైసీపీ ప్రభుత్వ విధానాల పై చర్చించనున్నారు జనసేనాని. అలాగే.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోయేలా కార్యచరణ చేయనున్నారు.