తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులకే ఆల్ అవుట్ కాగా… తర్వాత చేదనకు దిగిన టీమిండియా లక్షాన్ని 18.4 ఓవర్లలోనే చేదించింది. తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద… ఇంగ్లాండ్ వన్డే చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఓడించింది ఇండియా. అయితే.. ఈ మ్యాచ్ లో బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు.
నిన్నటి మ్యాచ్ 19 పరుగులకు ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ (6/19) తో ప్రదర్శన కనబర్చిన తొలి ఇండియా పేసర్ గా చరిత్ర క్రియేట్ చేశాడు బుమ్రా.ం 2003 లో వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు (6/23) అత్యంతమ గణాంకాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ 2018 ఇంగ్లాండ్ పై (6/25 ) తో మెరిశాడు. దీంతో బుమ్రా ఇంగ్లండ్ గడ్డపై ఈ రికార్డు సృష్టించాడు. కాగా.. ఈ మ్యాచ్ లో గెలుపుతో.. 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో ఇండియా ముందంజలో ఉంది.