కలెక్షన్ ల సునామీతో హోరెత్తిస్తున్న “జవాన్” మూవీ !

-

షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ హీరోగా తెరకెక్కించిన సినిమా “జవాన్”, ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని భారీ వసూళ్లను సాధించుకుంటూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే మొదటి రోజు వసూళ్ల విషయంలో దాదాపుగా సౌత్ ఇండస్ట్రీ లో ఏ సినిమాలకు రాని విధంగా కలెక్ట్ చేసి రికార్డ్ సాధించింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారంఎం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది జవాన్ మూవీ. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులలో రూ. 600 కోట్ల క్లబ్ లోకి చేరుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గత రెండు రోజులుగా కొంచెం వసూళ్లు తగ్గినా, ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్ట్ చేసిన మొత్తం రూ. 621 .86 కోట్లుగా ఉంది. షారుఖ్ ఖాన్ కెరీర్ లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రభంజాన్ని సృష్టిస్తోంది.

ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు అందరూ ఇక అట్లీ వెనుక పాడడం ఖాయం అంటూ సినీ పండితులు భావిస్తున్నారు. మరి ముందు ముందు ఫుల్ రన్ లో జవాన్ మూవీ ఎన్నో కోట్ల వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news