నేడు తుఫాన్ గా వాయుగుండం… ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండం… తుఫాన్ గా ఏర్పడుతోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు తుఫాన్ ’జవాద్ ‘ గా మారనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతం అయిన వాయుగుండం క్రమక్రమంగా తీరం వైపు దూసుకోస్తుంది. ఇది రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలుపుతోంది. ప్రస్తుతం విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉంది.

తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉండనుంది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయ. ఇప్పటికే ఈ జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. తుఫాన్ కారణంగా ఈ రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లోద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే తుఫాన్ కారణంగా ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేలు 94 రైళ్లను రద్దు చేశాయి.