ఇద్దరు స్టార్ హీరోలు ఒకే టైటిల్ తో సినిమా… రెండు పెద్ద హిట్లే…

-

సాధారణంగా ఒకే టైటిల్ తో రెండు సార్లు సినిమాలు చేయడం చూస్తుంటాం. పాత కాలంలో వచ్చిన సినిమా టైటిళ్లనే కథ డిమాండ్ ను బట్టి మళ్లీ వాడుతుంటారు. అయితే ఇలా వచ్చిన సినిమాలు అన్ని హిట్ కావాలని రూలేం లేదు. అయితే ఇద్దరు స్టార్ హీరోలో ఒకే టైటిల్ తో హిట్ కొట్టిన సినిమాలు చాలా అరుదు. ఇందులో ఒకరు ఫ్యామిలీ హీరో శోభన్ బాబు అయితే మరొకరు మెగాస్టార్ చిరంజీవి

తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన నటుడు శోభన్ బాబు. ఆంధ్రుల అందగాడిగా… మహిళలకు ఫేవరెట్ హీరోగా శోభన్ బాబుకు ఉన్న క్రేజే వేరు. క్రిష్ణా జిల్లా నందిగామకు చెందిన శోభన్ బాబు ఎవరి సపోర్ట్ లేకుండా మద్రాస్ వెళ్లి స్టార్ హీరోగా ఎదిగారు. మరోవైపు చిరంజీవి స్వతహాగా మెగస్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగళ్తూర్ కు చెందిన చిరంజీవి నటనపై ఉన్న ఆసక్తితో మద్రాస్ వెళ్లి సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా వెండితెరను ఏలుతున్న సందర్భంలో తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో తెలుగు తెరకు కొత్త హంగులు తీసుకువచ్చారు. అనతి కాలంలోనే అగ్రహీరోగా.. మెగాస్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 

ఇాదిలా ఉంటే శోభన్ బాబు, చిరంజీవి ఇద్దరూ కూడా ‘జేబుదొంగ’ టైటిల్ తో హిట్లు కొట్టారు. 1975లో శోభన్ బాబు, మంజూలా హీరో, హీరోయిన్లుగా సమతా ఆర్ట్ యోగేంద్ర నిర్మాణంలో విక్టరీ మధు సూదనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శోభన్ బాబు కెరీర్లో మాస్ హిట్ గా నిలిచింది. 1987లో ‘జేబు దొంగ’ టైటిల్ తో చిరంజీవి హీరోగా.. రాధ, భానుప్రియ హీరోహీరోయిన్లుగా కోదండరామిరెడ్ది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే టైటిల్ తో హిట్లు అందుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news