నేటి నుండి జేఈఈ మెయిన్ పరీక్షలు.. మొదటి సారిగా ప్రాంతీయ భాషల్లో

Join Our Community
follow manalokam on social media

నేటి నుండి జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి.  26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో హైద్రాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ , కరీం నగర్‌, వరంగల్‌, ఖమ్మం,నిజమా బాద్,సిద్ది పేట, సూర్యాపేట, మహబూబ్ బాద్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సారిగా ప్రాంతీయ భాషల్లో పరీక్ష జరగనుంది. హిందీ, ఇంగ్లీషు, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషలలో పరీక్ష జరగనుంది. గతేడాది కోవిడ్ నిబంధనలు ఈ సారి కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. రోజుకు రెండు విడతల్లో పరీక్షజరుగుతోంది. ఉదయం 9 నుండి 12 గంటకు వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష జరగనుంది.

పరీక్ష పత్రంలో మార్పులు చేశారు. ఈ సారి విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకు ఛాయిస్ కోసం ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు. తెలంగాణలో 73, 782 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈసారి నాలుగు సార్లు జేఈఈ మెయిన్ రాసే అవకాశం ఉంది. ..ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ , మే లలో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థి ఇష్టం మేరకు ఎన్ని సార్లైనా పరీక్ష రాయొచ్చని అంటున్నారు. ఇక ఈసారి తెలుగులో 374 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ సారి జేఈఈ మెయిన్ కి ఇంటర్ తత్సమాన పరీక్ష లో పాస్ అయితే చాలని చెబుతున్నారు. అలానే అరగంట ముందే పరీక్ష కేంద్రాల లో రిపోర్ట్ చేయాలని లేదంటే ఎంట్రీ ఉండదని అంటున్నారు.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...