మా ఆయన చంటి పిల్లాడు.. క్షమించండి: జీవిత

-

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, సఖ్యత లేకపోవడం అన్నది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడు ‘మా’ సమావేశం జరిగినా ఏదో ఒక వాడీవేడీ వివాదం ఉండడం పరిపాటిగా మారింది. ఇక తాజాగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య వాదన జరిగింది. అయితే చిరంజీవిని దూషించడం పెద్ద వివాదంగా మారింది. అంతకు ముందు హీరో రాజశేఖర్, మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య ఇలాంటి మాటల యుద్దమే నడిచింది. అంతకు ముందు మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య ‘మా’ నిధుల విషయమై పెద్ద రచ్చే నడిచింది.

ఇక ప్ర‌స్తుతం మా సభ్యుల్లో నిజాయితీ తగ్గిందని రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు సభ్యత లేకుండా అలా ఎలా మాట్లాడతారంటూ చిరంజీవి కూడా సీరియస్ కావడంతో అసలు రచ్చకు తెరలేచింది. అయితే అందర్లోనూ రాజశేఖర్ విలన్ కావడంతో ఆ బాధ్యతను ఆయన భార్య జీవిత తీసుకుంది. రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ కవర్ చేసింది జీవిత. చిరంజీవి లాంటి వాళ్ల దగ్గర్నుంచి మేం చాలా నేర్చుకున్నామంటూ చెప్పుకొచ్చింది. మా కు ఆయన ఎంతో చేసారంటూ మునగ చెట్టెక్కించే ప్రయత్నం చేసింది జీవిత. దాంతో అక్కడున్న వాతావరణం కాస్త కూల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news