ఇకపై సేవలకే అంకితం.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్..

-

ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవో గా తప్పుకుంటానని ఉద్యోగులందరికీ లేఖ రాసాడు. అమెజాన్ సంస్థ ప్రపంచ కంపెనీల్లో టాప్ గా ఉంది. మరి అలాంటి కంపెనీని స్థాపించి, సీఈవోగా ఉన్న జెఫ్ బెజోస్ ఇకపై ఆ ఉద్యోగానికి రాజీనామా చేయనున్నాడట. ఆయన స్థానంలో ఆండీ జాసీని సీఈవోగా నియమించనున్నారట. ప్రస్తుతం ఆండీ జాసీ, అమెజాన్ వెబ్ వెబ్ సర్వీసులని చూసుకుంటున్నాడు.

సీఈవోగా వైదొలగిన తర్వాత జెఫ్ బెజోస్ ఏం చేయబోతున్నాడో వెల్లడి చేసాడు. ఇకపై సేవ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపాడు. ఇప్పటి వరకు అమెజాన్ ని అగ్రస్థానంలో ఉంచి, ప్రపంచంలో అందరికంటే కుబేరుడిగా ఎదిగిన జెఫ్ బెజోస్, పూర్తిగా సేవా కార్యక్రమాల్లోకి దిగడ అంటే ఎంతో మందికి మేలు కలుగుతుందన్న మాట. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో జెఫ్ బెజోస్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news