బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గత కొంత కాలంగా శిఖర్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఇద్దరు కొన్నాళ్ల పాటు కనిపించక పోవడంతో జాన్వీ కపూర్, శిఖర్ ల ప్రేమ విషయం మీడియాలో పెద్దగా సందడి చేయలేదు. కానీ మళ్లీ వీరిద్దరు కలిసి కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చినట్లు అయ్యింది.
తరచు ఏదో ఒక కారణంతో వార్తల్లో కనిపించే హీరోయిన్ జాహ్నవి కపూర్ వ్యక్తిగత జీవితం పరంగా సినిమాలతో హాట్ ఫోటోషూట్లతో ప్రతినిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ భామ అయితే ప్రస్తుతం మళ్ళీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో కనిపించి హాట్ టాపిక్ గా మారింది..
తాజాగా రియా ఇంటికి ఒకే కారులో జాన్వీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ లు కలిసి వచ్చింది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్స్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె తన ఫేస్ ను దాచుకునేందుకు ప్రయత్నించింది. అంతే కాకుండా ఆమె శిఖర్ వైపు చూస్తూ సిగ్గు పడింది. ప్రస్తుతం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వీరిద్దరిని చూసిన ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చూపించమని ఎంతగా అడిగినా ఆమె ఒప్పుకోలేదు.. అయితే దీంతో వీరిద్దరూ మల్లి ప్రేమలో పడ్డారని వార్తలో గుప్పమన్నాయి..
అయితే జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది హీరోయిన్గా మంచి మార్క్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఈమె సినిమాలో పెద్దగా హిట్ సాధించలేదు అయితే ఈమె త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ చిత్రంలో నటించనుండని తెలుస్తోంది..