బ్యూటీ స్పీక్స్ : అందాల జాన్వీ.. ఆనందాల తీరాల‌లో..

-

ప్రేమ ద్వేషం అనే రెండు ప‌దాల ద‌గ్గ‌ర అందం అంతా దిగ‌దుడుపు అయి ఉంటుంది. ప‌ద‌హారేళ్ల ప్రాయానికి శ్రీ‌దేవి ఎలా ఉంది? అదే ప్రాయం కొంచెం అటు ఇటుగా ఉంటే జాన్వీలా ఉంటుంది..అవును! జాన్వీ అలానే ఉంది. శ్రీ‌దేవిలా ఉంది. లా కాదు శ్రీ‌దేవే!

అతిలోక సుంద‌రి కుమార్తె అందాల జాన్వీ కి సంబంధించిన కొన్ని చిత్రాలివి..వాటి నేప‌థ్యం ఏం అయి ఉంటుందా ఆమె ఆనందాల‌కు హ‌ద్దు ఉందా లేదా? ఇలాంటివెన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తులు ఈ చిన్ని చిత్ర కథంబంలో! ఎ ఫొటో స్టోరీ ఎబౌట్ జాన్వీ బేబీ ఫ‌ర్ యూ… 24 ఏళ్ల అందం 16 ఏళ్ల సోయ‌గం క‌లిస్తే జాన్వి విడ‌దీస్తే కూడా జాన్వీనే కానీ విడ‌దీసి చూడ‌లేక‌పోతే మీకు అందాన్ని ఆస్వాదించ‌డం తెలియ‌ద‌ని భావించాల్సిందే!

  1. నీటిలో చేప పిల్ల‌లా ఉంది జాన్వీ. హాయి అన్న‌ది ఒక అనిర్వ‌చనీయం అయి ఉంది ఆమెకు. హాయి అన్న‌ది చిరునామా అయి ఉంది ఆమెకు.. పాల బుగ్గ‌ల పిల్ల న‌వ్వులలో తేలిపోతున్న స‌ర‌దా సంగ‌తులెవో ముఖార‌విందం దాస్తోంది. లోకాన ఆనందించ‌డానికి ఇంత అందం ఉంది.. దీంతో పాటు మ‌రికొంత అందం ఆ ప్ర‌కృతిలో ఉంది. వీటితో పాటే జాన్వీలోనూ ఉంది.

2. శ్రీ‌దేవి అని పొర‌బ‌డితే త‌ప్పు. శ్రీ‌దేవి లాంటి శ్రీ‌దేవి అని గుర్తు ప‌డితే చాలు జాన్వీ పొంగిపోతుంది. అయినా లోకంలో శ్రీ‌దేవి ఒక్క‌రే మ‌రో శ్రీ‌దేవికి చోటే లేదు. నీటిలో ఉన్నా నేల‌పై ఉన్నా ఆ బుగ్గ‌ల బంగారి శ్రీ‌దేవి కూతురు.. శ్రీ‌దేవి మాత్రం కాదు.. లోకంలో అస‌లు ఒక్క‌టే న‌క‌లు ఉండ‌దు.. జ‌స్ట్ మ‌నం అలా అనుకుంటాం అంతే!

3. మ‌నుషులకు ప్రేమ దేవ‌త‌లు కావాలి.. లోకాన ప్రేమ పెరుగుతున్న కొద్దీ ఆరాధ్య రూపాలు మారిపోతూ ఉంటాయి. దాచుకోలేనంత ప్రేమ మ‌న ఆర్య‌ది.. అదేలేండి మ‌న అల్లు వారి అబ్బాయి బ‌న్నీది.. దాచుకోద‌గ్గ ప్రేమ పంచుకోద‌గ్గ అభిమానం అన్నీ అన్నీ జాన్వీవే! అందాల‌లో ఓ మ‌హోద‌యం ఇదేనా! అని ఓ మేలి త‌ల‌పు ఇవాళ మ‌న‌సులో క‌లుగుతుంటే చాలు.. మ‌ళ్లీ ఆనందాల‌ను ప‌ర‌వ‌శాల‌కు జ‌త చేయాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news