ఉద్యోగులకు గుడ్ న్యూస్ : డీఏ పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల క‌రువు భ‌త్యం (డీఏ) ను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు అంద‌రికీ డీపీ పెంచాల‌ని ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ రాష్ట్ర కేబినేట్ స‌మావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బుధ వారం సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగుల‌కు డీఏ పెంచుతూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

telangana-logo

అంతే కాకుండా పెంచిన డీఏ 2021 జూలై ఒక‌టి నుంచే వ‌ర్తిస్తుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కరోనా కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ ను పెంచ‌లేదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు పెండింగులో ఉన్న మూడు డీఏ ల‌ను ఒకే సారి ప్ర‌క‌టించాల‌ని రాష్ట్ర కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో సీపీఎస్ వ‌ర్తించే ఉద్యోగుల‌కు బ‌కాయిల్లో ప‌ది శాతాన్ని ప్రాన్ ఖాతాకు జ‌మ చేయ‌నున్నారు. 90 శాతాన్ని జూన్ నెల నుంచి విడుత‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. అలాగే విశ్రాంత ఉద్యోగుల‌కు కూడా డీఏ ను జూన్ నెల నుంచి వ‌ర్తించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news