కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.
Haryana Chief Minister Manohar Lal Khattar tests positive for #COVID19. pic.twitter.com/Qn5kJ024Aa
— ANI (@ANI) August 24, 2020
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని మనోహర్ లాల్ తెలిపారు. దీంతో ఆయన సంప్రదించిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆయన సూచించారు. కాగా, ఈ నెల 19 న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో కలిసి ఒక సమావేశంలో పాల్గొన్నారు సీఎం మనోహర్ లాల్. అనంతరం గజేంద్ర సింగ్ షేకావత్ కి కరోనా రావడంతో సీఎం మనోహర్ లాల్ హోం క్వారంటైన్ కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.