మ‌రో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో.. హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం..

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో కొత్త ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. దీని ద్వారా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.

jio launched rs 598 plan which gives hot star subscription for free

రూ.598 ప్లాన్‌లో కస్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2జీబీ డేటా ల‌భిస్తుంది. 2వేల నిమిషాల నాన్ జియో వాయిస్ కాల్స్ వ‌స్తాయి. జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. జియో యాప్స్‌కు కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ల‌భిస్తాయి. ఇక ఈ ప్లాన్‌తో ఏడాది కాల వ్య‌వ‌ధి క‌లిగిన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.

కాగా ఇటీవ‌లే జియో రూ.499, రూ.777 ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేసింది. వీటిల్లోనూ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా వ‌స్తుంది. రానున్న ఐపీఎల్ టోర్నీ నేప‌థ్యంలో జియో ఈ ప్లాన్ల‌ను క‌స్ట‌మ‌ర్ల కోసం ప్ర‌వేశ‌పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news