కరోనా వైరస్ సమయంలో ఇప్పుడు ఏసీలు వాడకం అనేది చాలా వరకు తగ్గింది. చాలా మంది ఇప్పుడు ఏసీలు వాడాలి అంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. దీనితోనే చాలా వరకు కూడా ఏసీల వినియోగాన్ని తగ్గించారు. కొంత మంది ఏసీలు పీకి తక్కువ ధరలకు అమ్మేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏసీ ల కోసం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏసీలు ఎంత ఉష్ణోగ్రతలు వాడాలి ఏంటి అనేది మార్గదర్శకాల్లో పేర్కొంది. ఏసీ ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉండవచ్చు అని పేర్కొంది. అలాగే తేమ 40 డిగ్రీల నుంచి 70 డిగ్రీల వరకు ఉండవచ్చని మార్గదర్శకాల్లో వివరించింది. స్వచ్ఛమైన గాలిని ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంది. తగినంత క్రాస్ వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.