గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. తాజాగా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సపోర్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకి ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యచ్చు.

 

bank of india

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ. కాంట్రాక్ట్ విధానం లో ఈ నియామకాలను చేపట్టారు. ఇక అర్హత విషయంలోకి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్, BSW/ BA/ B.Com విద్యార్హతలను పొందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తప్పక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక వయస్సు విషయంలోకి వస్తే.. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డిమాన్స్ట్రేషన్ లేదా ప్రజంటేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఎంపికైన అభ్యర్థులు మెయిన్ పురి, కనౌజ్, ఫరూఖాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
ది జోనల్ మేనేజర్,
బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఆగ్రా జోనల్ ఆఫీస్,
సంజయ్ ప్యాలెస్, ఆగ్రా 282001.

Read more RELATED
Recommended to you

Latest news