కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్-I, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్ – II పోస్టులు వున్నాయి.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కెమికల్ ల్యాబొరేటరీలో మొత్తం తొమ్మిది ఖాళీలు వున్నాయి అని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. అప్లై చేసుకోవాలంటే అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఇది ఇలా ఉంటే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ ని పూర్తి చేసి ఉండాలి.

అలాగే నెట్‌/గేట్‌ లో అర్హత ఉండాలి అని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. అంతే కాకుండా సంబంధిత విభాగం లో పని అనుభవం కూడా ఉండాలి. కనుక ఈ అర్హతలు వున్నాయి అంటే అప్లై చేసుకోండి. శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్‌ 5, 2022. ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను https://www.ncl-india.org/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news