తారక్ కాదన్నాడు.. చరణ్ ఔనన్నాడు.. ఆ బొమ్మ బ్లాక్ బాస్టర్..

-

సినిమా తీయాలంటే ప్రధానంగా కావల్సింది స్టోరి. కాగా, హీరోలకు నచ్చే విధంగా కథలను తయారు చేయడంతో స్టోరి రైటర్స్, దర్శకుడు శ్రద్ధ కనబరుస్తుంటారు. ఎలాగైనా కథ ద్వారా హీరోను ఒప్పించి మూవీ సక్సెస్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే హీరోలకు కథలు చెప్తుంటారు కూడా. హీరోలూ తమకు కథ నచ్చకపోతే మొహమాటం లేకుండా తిరస్కరిస్తుంటారు. అయితే, ఓ హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో యాక్సెప్ట్ చేసి ఫిల్మ్ చేయగా అది సూపర్ హిట్ ఫిల్మ్ కొట్టడం ఇండస్ట్రీలో చాలా సార్లు జరిగి ఉంటుంది.

అలా తెలుగు చిత్రసీమలో చాలా చిత్రాలే ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తీసిన ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ని తొలుత ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు. అయితే, ఆయనకున్న ఇమేజ్ వేరని అనుకుని, ఒకవేళ ఆయనకు చెప్తే ఓకే చేస్తాడా? అని అనుమానపడ్డాడు. అలా ఆ కథను విజయ్ దేవరకొండ తో తీసి బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అయ్యాడు. ఆ మూవీని చూసి బన్నీ కూడా మెచ్చుకోవడం గమనార్హం. అలా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా ఒకటి రామ్ చరణ్ యాక్సెప్ట్ చేసి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ అందుకున్నాడు. అది ఏ సినిమానంటే..

వక్కంతం వంశీ ఆ సినిమాకు స్టోరి అందించగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఆ సినిమాయే ‘ఎవడు’. ఈ పిక్చర్ స్టోరిని వక్కంతం వంశీ .. జూనియర్ ఎన్టీఆర్ ను ఊహించుకుని రాసుకున్నారట. అందులో కథ పరంగా ఇద్దరు పాత్రల్లో నందమూరి కల్యాణ్ రామ్, తారక్ లను అనుకున్నారు. కానీ, వాళ్లు రిజెక్ట్ చేయడంతో స్టోరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వద్దకు వచ్చింది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కీలకమైన పాత్ర ఒకదానిని బన్నీ పోషించగా మూవీ సూపర్ హిట్ అయింది. ఇకపోతే తారక్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news