మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చెయ్యచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
హెచ్‌ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక అర్హతల వివరాలలోకి వెళితే… దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కుల తో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలానే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. పనిలో అనుభవం కూడా ఉండాలి.
ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆఫ్‌లైన్ మోడ్‌లో పంపించాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. పోస్టుల ఆధారంగా నెలకు రూ. 52,000 నుంచి రూ. 2,20,000 వరకు చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 30 నుండి ఏప్రిల్ 20 వరకు, హార్డ్ కాపీలను పంపడానికి ఏప్రిల్ 05 నుండి ఏప్రిల్ 25గా నిర్ణయించారు. హార్డ్ కాపీలను జనరల్ మేనేజర్, హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, గాంధీగ్రామ్, విశాఖటపట్నం 530005 అడ్రస్‌కు పంపించాలి. పూర్తి వివరాలను https://www.hslvizag.in/ లో చూడచ్చు.