
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. HYDలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వసింశెట్టి సురేష్ కుమార్(45) తన సమీప బంధువు అయిన ఆనుసూరి సాయి సుధీర్(20)తో కలిసి కారులో వెళ్తుండగా దండుమల్కాపురం శివారులోకి రాగానే ట్రావెల్ బస్సు అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్‌కు తీవ్ర గాయాలై.. మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.