చిత్ర పరిశ్రమలో మరో విషాదం : బిగ్ బాస్ విన్నర్, ప్రముఖ నటుడు మృతి

చిత్ర పరిశ్రమ లో మరో విషాదం నెలకొంది. 2020 నుంచి ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులను… చిత్ర పరిశ్రమ కోల్పోయింది. అటు కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం లో… ఈ వరుస విషాదాలు మరి ఇంత డీలా పడేస్తున్నాయి. అయితే తాజాగా… ప్రముఖ నటుడు, హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్ల మృతి చెందాడు. బిగ్ బాస్ -13 విజేతగా నిలిచిన… సిద్ధార్థ శుక్ల గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆయ ముంబై లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే గుండెపోటుతో మృతి చెందాడు లేక మరేదైనా కారణమా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ శుక్ల.. బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సిద్ధార్థ శుక్ల మృతి పట్ల చిత్ర పరిశ్రమ… సంతాపం తెలిపింది.