బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్ ప్యాస్ అయితే చాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ లోని మొత్తం 1410 కానిస్టేబుల్ (ట్రేడ్‌మ్యాన్‌) పోస్టులు వున్నాయి. స్త్రీ, పురుష అభ్యర్ధులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే ప్లంబర్‌/పెయింటర్‌/ఎలక్ట్రీషియన్‌/పంప్‌ ఆపరేటర్‌/డ్రాఫ్ట్‌మ్యాన్‌/టిన్‌స్మిత్‌/టైలర్‌/కాబ్లర్‌/బార్బర్‌/మాలి/స్వీపర్‌/వాషర్‌మ్యాన్/కుక్‌/ తదితర స్పెషలైజేషన్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ని కలిగి ఉండాలి.

ఇక వయసు విషయానికి వస్తే… వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే… నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు ఇస్తారు. దానితో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. పూర్తి వివరాలని https://bsf.gov.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news