తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆదివారం రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న గవర్నర్ అక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలను వారికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై కేంద్రానికి రిపోర్ట్ పంపినట్లు గవర్నర్ మీడియాకు తెలిపారు.
అలాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించడం, హైకోర్టులో కేసీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వంటి ఘటనలను గవర్నర్ కేంద్రానికి వివరించే అవకాశం లేకపోలేదు. ఇక తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలతో గవర్నర్ టూర్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా గవర్నర్ తమిళిసై, కెసిఆర్ మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపిస్తుంది. ఇలా తాజాగా జరిగిన అన్ని పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించే అవకాశాలు కనబడుతున్నాయి.