డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌ లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌ లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసారు. అర్హ‌త, ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌

నోటిఫికేష‌న్ ద్వారా 16 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌, సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్ అన‌లిటిక్స్‌, డిజైన‌ర్ వంటి పోస్టులు ఉన్నాయి. జులై 1 దరఖాస్తులకు చివరి తేది. రాత ప‌రీక్ష కూడా లేదు కేవలం ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. https://www.dic.gov.in/ వెబ్‌సైట్‌ లో పూర్తి వివరాలని చూడవచ్చు.

ఇక పోస్టుల గురించి చూస్తే.. మొత్తం పోస్టులు: 16, సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్- 3, డెవ‌ల‌ప‌ర్- 6, సాఫ్ట్‌వేర్ టెస్ట‌ర్ క‌మ్ డెవ‌ల‌ప‌ర్- 2, సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్- 1, కంటెంట్ మేనేజ‌ర్ లేదా రైట‌ర్- 2,
డిజైన‌ర్- 2.

పోస్టులని బట్టి అర్హతలు వేరు వేరుగా వున్నాయి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూలై 1, 2021 న ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ. పూర్తి వివరాలని https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news