సీతానగరం ఉదంతం పై స్పందించిన సీఎం జగన్

-

సీతానగరం ఉదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగిందని..ఇది నా మనసును చాలా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చాలా చింతిస్తున్నానని..ఇలాంటి ఘటనలు ఎక్కడా జరక్కూడదన్నారు. మహిళలు అర్థరాత్రిపూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని తానని… ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, మీ తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరును చూస్తే.. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని ఇట్టే అర్థం అవుతుందని.. ఇంట్లో అక్క చెల్లెమ్మ చిరునవ్వుతో ఉన్నప్పుడే ఆ ఇళ్లు బాగుపడుతుందని తెలిపారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నామినేటెడ్‌ పనులు, కాంట్రాక్టుల్లో యాభైశాతం మహిళలకు ఇస్తూ చట్టం చేసిన ప్రభుత్వం మనదని.. ఇవాళ అక్క చెల్లెమ్మలు అగ్రభాగాన కనిపిస్తున్నారన్నారు. రాష్ట్ర కేబినెట్లో నా చెల్లి… ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరో చెల్లి.. హోంమంత్రిగా ఉన్నారని.. అక్క చెల్లెమ్మకు మంచి జరగాలి, చేయాలన్న ఆరాటంతోనే మంచిచేశామని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఏపీ దిశా బిల్లును తీసుకొచ్చామని.. కేంద్ర ఆమోదానికి పంపామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకూ ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ ను ఏర్పాటు చేశామని.. మొత్తంగా 18 పోలీస్‌ స్టేషన్లు.. ప్రతి పోలీస్‌ జిల్లాకు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో దిశ కేసుల కోసం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లనుకూడా నియమించామని.. దిశ , అభయ్‌ యాప్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news