నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉబెర్ లో ఉద్యోగాలు…

-

నిరుద్యోగులకు ఉబెర్ సంస్థ శుభవార్త చెప్పింది. మరింత మంది ఇంజినీర్లను దేశంలో ఉబర్ నియమించుకోనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 500 మంది టెకీలను హైర్ చేసుకుంటామని ఉబెర్ ప్రకటించింది. కిందటేడాది 250 మంది టెకీలను ఉబెర్ నియమించుకున్న విషయం తెలిసిందే. దేశంలోని తమ టెక్‌‌ సెంటర్లలో ఉద్యోగులను పెంచుతున్నామని పేర్కొంది ఉబెర్. కేవలం ఇండియానే కాదు యూఎస్‌‌, కెనడా, లాటిన్ అమెరికా, ఆమ్‌‌స్టర్‌‌‌‌డామ్‌‌లలోని టెక్ సెంటర్లలో ఉద్యోగులను పెంచుతోంది ఉబెర్.

Uber Technologies New 2021 Vector Logo - Logowik.com

ఇండియాలో ఉబర్‌‌‌‌కు హైదరాబాద్‌‌, బెంగళూరులలో టెక్ సెంటర్లు ఉన్నాయి. ఈ రెండు సెంటర్లలో 1,000 మంది టెకీలు పనిచేస్తున్నారు కూడా. తాజాగా మరో 500 మందిని ఈ రెండు సెంటర్ల కోసం నియమించుకోవాలని చూస్తోంది ఉబెర్. దేశంలోని ఇంజినీరింగ్ ట్యాలెంట్‌‌ను గుర్తించామని, ఇందుకు తమ హైరింగ్ ప్లాన్‌‌ నిదర్శనమని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరులోని టెక్‌‌ సెంటర్‌‌‌‌లో కొత్త ఫ్లోర్‌‌‌‌ను కూడా ప్రారంభించింది ఉబర్.

Read more RELATED
Recommended to you

Latest news