రాజకీయాల్లో ఎప్పుడైనా నాయకులని ప్రజలు పొగడాలి..నాయకులు ఎప్పుడు ప్రజల మన్ననలు పొందాలి..కానీ నేటి రాజకీయాల్లో ప్రజలు పొగిడేది తక్కువ కనిపిస్తోంది…నాయకులు ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోవడంలోనే ముందు ఉంటున్నారు. తాము తోపు అంటే తాము తోపు అని అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే బాగా భజన చేస్తున్నారు..ఏపీలో ఈ భజన రాజకీయాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఏమో జగన్ కు భజన చేస్తుంటే… టీడీపీ నేతలంతా చంద్రబాబుకు భజన చేస్తున్నారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే..జగన్, బాబు కూడా సొంత డబ్బా బాగా కొట్టుకుంటున్నారు. ఏదైనా సభల్లో ఈ ఇద్దరు నేతలు సొంత డబ్బా ఎక్కువ కొట్టుకోవడం కనిపిస్తోంది. అయితే ఈ డబ్బా కొట్టుకోవడంలో బాబు ఎప్పుడు ముందే ఉంటారని చెప్పొచ్చు…ఎందుకంటే ఆయన మైక్ పట్టుకుంటే చాలు…14 ఏళ్ల సీఎం, 13 ఏళ్ళు ప్రతిపక్ష నేత…అంటూ తన గురించి తానే ఎక్కువ చెప్పుకుంటారు..ఏపీ రాజకీయాల్లో తన రికార్డుని ఎవరు బద్దలగొట్టలేరని అంటారు..సరే ఇందులో వాస్తవం లేకపోలేదు…ఏపీని ఎక్కువ కాలం పాలించింది, ప్రతిపక్ష నేతగా ఉంది బాబే..అయితే ఆ విషయం ఆయనకు ఆయనే చెప్పుకుంటే డప్పు కొట్టుకున్నట్లే ఉంటుంది.
అయినా బాబు ఈ డప్పు ఆపరు కదా..ఈ విషయంలోనే కాదు..అనేక విషయాల్లో బాబు వైఖరి ఇలాగే ఉంటుంది…ఈ మధ్య కూడా తన పర్యటనలకు విశేషమైన ప్రజా స్పందన వస్తుందని, అది చూసి జగన్, వైసీపీ భయపడిపోతుందని అంటున్నారు. ఇటీవల చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది..అంతా మాత్రాన తన బలం పెరిగిపోయిందని, జగన్ బలం తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు..కానీ బాబు అలా అనుకోవడం లేదు…ఇంకా తనకు తిరుగులేదని అనుకుంటున్నారు.
ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళుతున్నారు..బలం పెరిగిందని జనం మాట్లాడుకుంటే బాగుటుంది…అలా కాకుండా బాబే సొంత డబ్బా కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు…కాబట్టి బాబు ఇప్పటికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో ముందుకెళితే బెటర్.