అది ఘోరమైన తప్పిదం.. రష్యాకు బైడెన్‌ వార్నింగ్

-

ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించవచ్చనే ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్చరించారు. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్తు కర్మాగారంలో రష్యా బలగాలు రహస్యంగా పని చేస్తున్నాయని, ఆ కసరత్తు అంతా ‘డర్టీ బాంబు’ను ప్రయోగించడానికేనని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తే అది ‘తీవ్ర తప్పిదమే’ అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.

‘దాన్ని తప్పుదోవ పట్టించే ఆపరేషన్‌ అని చెప్పలేను. కానీ, ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణ్వాయుధం ఉపయోగిస్తే రష్యా తీవ్రమైన తప్పు చేసినట్లే’ అని రష్యా డర్టీ బాంబు ప్రయోగంపై వైట్‌హౌస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ విధంగా బదులిచ్చారు.

ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించడం తీవ్ర తప్పిదమే కాకుండా అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరైన్‌ జీన్‌-పెర్రీ అన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్న ఆమె.. సాకుగా చూపడానికే పుతిన్‌ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news