అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు.
డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి ఆయన తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి కొద్దిరోజులుగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
- అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జో బైడెన్..
- దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్నట్లు వెల్లడి..
- ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్న బైడెన్..
- కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బైడెన్..
- అధ్యక్ష పోటీకి కమలాహారిస్‌ను ప్రతిపాదించిన బైడెన్