టెస్ట్ లలో ఇంగ్లాండ్ తరపున అత్యధిక క్యాచ్ లతో జో రూట్ రికార్డ్…

-

యాషెస్ సిరీస్ లో భాగంగా ఎన్నో రికార్డులు నమోదు అవుతున్నాయి. లార్డ్స్ లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండవ యాషెస్ టెస్ట్ లో భాగంగా ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ ఒక రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరపున టెస్ట్ లలో అత్యధిక క్యాచ్ లను అందుకున్న ఆటగాడిగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టయిర్ కుక్ పేరు మీద ఉండేది… కుక్ తన కెరీర్ లో మొత్తం 175 క్యాచ్ లను అందుకున్నాడు. ఈ రోజుటి వరకు ఇదే రికార్డు గా ఉంది.. కానీ జో రూట్ ఈ రికార్డును చెరిపేసి తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు… టెస్ట్ లలో రూట్ 176 క్యాచ్ లను అందుకుని ఇంగ్లాండ్ తరపున మొదటి స్థానంలో నిలిచాడు.

 

ఓవరాల్ గా చూసుకుంటే రూట్ 6వ స్థానంలో ఉన్నాడు.. ఇక మొదటి స్థానంలో ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 210 క్యాచ్ లతో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news