తండ్రి బ్రోకర్‌.. కొడుకు జోకర్‌ : మంత్రి జోగి రమేశ్‌

-

తండ్రి బ్రోకర్‌.. కొడుకు జోకర్‌ అంటూ నిప్పులు చెరిగారు మంత్రి జోగి రమేశ్‌. దమ్మున్న నాయకుడికి ప్రత్యక్ష ఉదహరణ జగన్ అని మంత్రి కొనియాడారు. లోకేశ్ పాదయాత్రపై మండిపడ్డ జోగి రమేశ్ నీదొక పాదయాత్ర… నువ్వొక లీడర్ వా అంటూ ఫైర్ అయ్యారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్ లో ఉన్నారని విమర్శించారు.కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోందీ యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా జిల్లాకు చెందిన మంత్రులు, ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి లోకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపైనా నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తోన్నారు.

 

ఇవి కాస్తా రాజకీయ వేడిని రాజేస్తోన్నాయి. ఇన్ని రోజుల పాదయాత్రలో నారా లోకేష్ ఏం సాధించారు? టీడీపీ గ్రాఫ్ ఎలా ఉందనే విషయంపై ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు స్పందించారు. లోకేష్ పాదయాత్రకు భారీగా జనం తరలి వస్తోన్నారని టీడీపీ చెబుతోండగా.. దీన్ని కొట్టి పారేస్తోంది అధికార పార్టీ. నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోందని, దీన్ని జాకీలేసి పైకి లేపే ప్రయత్నాలను అనుకూల మీడియా చేస్తోందంటూ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version