గతకొంతకాలంగా గంటా శ్రీనివాస్ వైకాపాలోకి వెళ్తున్నారని కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుని విశాఖ వైకాపా నేతలు విమర్శిస్తున్నా కూడా గంటా స్పందించని సమయంలో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. అలా అని జగన్ విషయంలో కూడా మౌనాన్నే తన బాషగా చేసుకోవడంతో ఆల్ మోస్ట్ కన్ ఫాం అయ్యింది! దీంతో వచ్చే నెల రెండోవారంలో “గంటా ఇన్ వైకాపా” కు ముహూర్తం ఫిక్సయినట్లు చెబుతున్నారు. దానికి జగన్.. గంటాకు ఒక కండిషన్ పెట్టారని.. లేదా… గంటానే జగన్ కు ఒక ఆఫర్ ఎరేసి వైకాపాలోకి వస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి!!
వివరళ్లోకి వెళ్తే… గంటా శ్రీనివాస్ వైకాపాలోకి వస్తోన్నారన్న విషయంపై నిన్నమొన్నటి వరకూ కాస్త డౌట్ ఉన్నప్పటికీ… తాజాగా టీడీపీ అనుకూల మీడియా రాతలు ఆ విషయాన్ని కన్ ఫాం చేసేశాయి! గంటా పార్టీని వీడినంత మాత్రాన్న పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు అన్నట్లుగా అప్పుడే కథనాలు వండేస్తున్నాయి. దీంతో “ఆల్ మోస్ట్ కన్ ఫాం” అని అంతా ఫిక్సయిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు గంటా ఒక ఆఫర్ ఇచ్చారని.. లేదా… జగనే గంటాను ఒక ఆఫర్ అడిగారని రాసుకొస్తున్నారు!
అదేమిటంటే… “విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవిని గెలిపించి ఇస్తాననే వాగ్దానంతో గంటా పార్టీలోకి ఎంటర్ అవుతారనంట”! ఇంతకు మించిన జోక్ ఒకటి ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న! రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 సీట్లలో 151 సీట్లు గెలిపించుకౌన్న జగన్ కు.. సీఎం అయ్యాక తన క్రెడిబిలిటీని ప్రజల్లో మరింత పెంచుకుంటున్న జగన్ కు.. విశాఖకు కూడా రాజధాని హోదా ఇచ్చి వారి మనసులకు మరింత దగ్గరైన జగన్ కు.. విశాఖలో మేయర్ పదవిని దక్కించుకోవడం పెద్ద విషయమా… దానికోసం జగన్, గంటాను అడగడమో.. గంటానే జగన్ కు ఆఫరివ్వడమో జరిగిందంటే అంతకు మించిన హాస్యాస్పదమైన మరో విషయం ఉంటుందా? అలా ఉన్నాయి కొందరి రాతలు!