శానిటైజర్ తో జర్నలిస్ట్ ని దారుణంగా చంపేశారు…!

శానిటైజర్ ని ఉపయోగించి జర్నలిస్ట్ ని దారుణంగా హత్య చేసారు. జర్నలిస్ట్ ఇంటిపై శానిటైజర్ జల్లి ఇల్లు తగలబెట్టారు. ఈ కేసుకి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 35 ఏళ్ల జర్నలిస్ట్, అతని స్నేహితుడి హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ రాకేశ్ సింగ్ మరియు అతని స్నేహితుడు పింటు సాహును బహదూర్పూర్ క్రాసింగ్ సమీపంలో ఒక అడవి దగ్గరలో హత్య చేసారు.

లలిత్ మిశ్రా, కేశ్వనంద్ మిశ్రా అలియాస్ రింకు మరియు అక్రమ్ అలీలను అరెస్టు చేసినట్లు బాల్రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ దేవరంజన్ వర్మ మీడియాకు వివరించారు. కేశ్వనంద్ తల్లి గ్రామ అధిపతి అని, తన కింద ఉన్న నిధులను రాకేశ్ సింగ్ బహిర్గతం చేశారని ఆయన మీడియాకు చెప్పారు. సాహు అక్కడే మరణించగా రాకేశ్ సింగ్ కాలిన గాయాలతో లక్నో ఆస్పత్రిలో చనిపోయాడు.