గ్రేటర్ పోలింగ్ : పాతబస్తీలో పోలీసుల హై అలెర్ట్ !

గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో పాతబస్తీలో పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. 590 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉండగా 387 అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ వద్ద ఆదనపు బలగాలు మోహరించారు. మొత్తం పాత బస్తీ 70వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ ట్రాకింగ్ టీం, రూట్ మొబైల్ టీం ల ఏర్పాటు చేశారు.

 

police
police

గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పురానపూల్, శాలిబండ లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో పురానాపూల్ లో రిపోలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రీ పోలింగ్, క్రాస్ ఓటింగ్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.