ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం చోటు చేసుకుంది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ జర్నలిస్ట్ మృతి చెందాడు. కలహండిలో ఈనెలలో జరిగే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులను పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కొన్ని పోస్టర్లను, బ్యానర్లను పలు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్ (46) అనే వ్యక్తి నుంచి ప్రచురితమయ్యే ప్రముక పత్రికకు చెందిన జర్నలిస్టు ఫొటో గ్రాఫర్ పని చేస్తున్నాడు.
మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్కర్లకుంట గ్రామం వద్ద మావోయిస్టులు ఒక చెట్టుకు అతికించిన పోస్టర్లు బ్యానర్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ అమర్చిన ఐఈడీ బాంబు పేలి మరణించాడని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముఖ్యంగా జర్నలిస్టు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్ కుటుంబానికి నవీన్ పట్నాయక్ రూ.13లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇందులో 9 లక్షలు పోలీసులు అందించగా.. మిగిలిన రూ.4లక్షలు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు మానస్ మంగరాజ్ వెల్లడించారు. జర్నలిస్ట్ హిత్కుమార్ భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం ఈ సంఘటనను ఖండించింది. వామపక్ష ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పని చేసే జర్నలిస్టుకు సరైన భద్రత కల్పించాలని సంస్థ కోరినది.