టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం కాదు… సెంట్రల్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు రాజకీయ మంటలను రాజేస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీ, టీఆర్ఎస్ లను విమర్శిస్తూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య ట్విట్ యుద్ధానికి దారి తీసింది. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్సీ కవిత ట్విట్ చేస్తే.. దీనికి ప్రతిగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో ట్విట్ చేశారు. 

తాజాగా రేవంత్ రెడ్డి,  ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై చేసిన ట్విట్ కు కౌంటర్ ఇచ్చారు. ‘‘ కవిత గారూ… టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో  పోరాటం చేయడం లేదు… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?’’ అంటూ ట్విట్ చేశారు.

అంతకుముందు రాహుల్ గాంధీ తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని… చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ కొట్లాడుతుందని ట్విట్ చేశారు. దీనికి కవిత … రైతులపై ప్రేముంటే, పార్లమెంట్ లో పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు ఇవ్వాలని కోరింది. నామమాత్రంగా ట్విట్టర్లో రైతులకు సంఘీభావం తెలపడం కాదని ట్విట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news