జూలై 14 రాశిఫలాలు : రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఈ రాశికి అధిక ధనలాభాన్ని తెస్తుంది!

967

మేషరాశి : మీ ప్రవర్తన, ఆహ్లాద కరమైన వ్యక్తిత్వం, మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, పాత సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి. ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది. ఈరోజు, సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఆనందంగా గడుపుతారు.
పరిహారాలు: పెద్దల దీవెనలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.

వృషభరాశి : ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగి వంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. దీనివల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. స్నేహితుల కలయిక, సహకారం అందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. పెద్దల సహాయంతో వాటిని అధిగమిస్తారు. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.
పరిహారాలు: ఎగతాళిగా ఉండకూడదు, ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలను గౌరవించండి. ఎందుకంటే సమయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు మరియు ఎల్లప్పుడూ మారుతుంది.

July 13th Sunday daily Horoscope

మిథునరాశి : ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు. మీ భాగస్వామి లేనప్పుడూ, మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. మీనిర్ణయాలు ఒక కొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.
పరిహారాలు: శంకరుడి దగ్గర లేదా రావిచెట్టు దగ్గర 3 నిమ్మకాయలు ఉంచండం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

కర్కాటకరాశి : ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీరింతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే, హుందాగా అంగీకరించండి. మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. ప్రేమలో విజయం సాధించడానికి, ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగ సహాయం చెయ్యండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. రొమాంటిక్ పాటలు, మంచి ఆహారం, చక్కని డ్రింక్స్. ఈ రోజంతా మీరు, మీ జీవిత భాగస్వామి మాత్రమే.
పరిహారాలు: మంచి ఆరోగ్యం కోసం శివాభిషేకం లేదా దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి : సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీ వద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. ఆందోళన పడకండి. మీ విచారం దానిలాగే ఈరోజే కరిగినీరైపోతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. ఇటీవలి గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా, మీ పట్ల తనకు ఎంతటి ఆరాధనా భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేయవచ్చు.
పరిహారాలు: ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి వ్యసనాలకు దూరంగా ఉండి, ఆదివార నియమాన్ని పాటించండి.

READ ALSO  ఆగస్టు 12 సోమవారం - రోజువారి రాశిఫలాలు

తులారాశి : మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది. చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొండి. అంతేకానీ వీధిన పడకండి. లేకపోతే పరువుపోగలదు. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి : ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగ కనిపిస్తున్నది. మీ ప్లాన్ లకిగానూ మీరు వారినుండి, పూర్తి సహకారం కోరవచ్చును. ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగ సరియైన మంచి మూడ్‌లో ఉంటారు. దుబారా ఖర్చులు పెట్టకండి. ఈరోజు గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
పరిహారాలు: కుటుంబ జీవితం సాఫీగా సాగడానికి గణపతి ఆరాధన చేయండి.

ధనస్సురాశి : కమిషన్ల నుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీకుచిరకాలంగా ఉన్న అప్పులను తీర్చెస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి బాధపడనవసరం లేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. ఈ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోను, పూవులతోను నిండిపోతుంది. శాస్ర్తోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.
పరిహారాలు: ఆనందమయమైన జీవితం కోసం సాధు జంతువులకు ఆహారాన్ని పెట్టండి.

మకరరాశి : మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఆరోగ్య సమస్యలు చిన్నవిగా భావించకండి. మొదట్లోనే డాక్టర్‌ను సంప్రదించండి. వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.
పరిహారాలు: సువాసనలు, సుగంధ పరిమళాలు వచ్చే వస్ర్తాలు వాడకం నుండి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

కుంభరాశి : యల్ ఎస్టేట్‌లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్‌నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. రొమాన్స్‌కి మంచి రోజు. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి.
పరిహారాలు: మంచి ఆనందమైన జీవితం కోసం తియ్యని ప్రసాదాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి.

READ ALSO  జనవరి 10 గురువారం- రోజువారి రాశిఫలాలు

మీనరాశి : రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చు. మంచిరోజులు కలకాలం నిలవవు. విహార యాత్ర, సినిమా వంటివి కుటుంబంలో ప్రేమను, సంతోషాన్ని పెంచే సమయం ఇది. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకులోను చేస్తారు ఈ రోజు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు.
పరిహారాలు: సంతోషం కోసం ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి.

– కేశవ