ఈ నెల 14 ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి!

274

ఈ నెల 14 ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. ట్విట్టర్‌లో వెల్లడించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేటీఆర్

ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అంటే ఆదివారం రోజు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విటర్‌లో వెల్లడించారు. 15వ తేదీలోపు ఇంటర్ ధ్రువపత్రాలు సమర్పించాలన్న షరతుపై పలువురు తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు సీట్లు ఇచ్చాయని, అయితే ఇప్పటివరకు ఇంటర్ ఫలితాలు రాకపోవడంతో సీట్లు కోల్పోతారని అంతా ఆందోళన చెందుతున్నారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్‌కు ట్విటర్‌లో విన్నవించారు.

ts inter supplementary results 2019 To Be Released On July 14

దీనికి స్పందించిన ఆయన ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికి ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫలితాలను మొదట శనివారం ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకు జేఎన్‌టీయూహెచ్ నిపుణుల పర్యవేక్షణలో తనిఖీ చేయిస్తున్నారు.

– కేశవ