జూలై 19- ఆషాఢమాసం- ఆదివారం- చతుర్దశి.
మేష రాశి: ఈరోజు మంచి ఫలితం కోసం ఏకాగ్రతతో పనిచేయండి !
ఉద్యోగస్తులు ఒకస్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. మీజీవితంలో ముఖ్యంకానీ వారి మాటలను మీరు పట్టించుకోవద్దు.
పరిహారాలుః ఆవాల నూనెతో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులను తినిపించండి. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.
వృషభ రాశి: ఈరోజు మానసిక తృప్తిని పొందుతారు !
మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంక ఏమిచెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు, ఇతరుల సహాయం తీసుకొండి. మీరు ఈరోజు మంచి నవలనుకాని, మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీరు కారణ మేంటో తెలియకుండా ఈరోజఅంతా బాధపడతారు.
పరిహారాలుః ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
మిథున రాశి: ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది !
ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. ఇంటివద్ద టేన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అణచుకుంటే శరీరానికి సమస్య. కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకొండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. విజయం కోసం కలలు కనడం తప్పుకాదు. కానీ మీ సమయంన్ని పగలు కూడా కలలు కనడానికే ఖర్చుచేయటం మంచిది కాదు.
పరిహారాలుః పేద వారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
కర్కాటక రాశి: ఈరోజు టెన్షన్ల నుంచి రిలీఫ్ !
ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు/ ఆమె ఓర్పును కోల్పోతారు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థ పూరితంగా వ్యవహరించవచ్చు.
పరిహారాలుః పక్షులకు ఆహారం, నీళ్లు అందించవచ్చు.
సింహ రాశి: ఈరోజు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల !
ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ప్రయాణం మీకు క్రొత్త ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.
పరిహారాలుః మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపర్చడానికి శ్రీకృష్ణుడికి కర్పూర హారతిని ఇవ్వండి.
కన్యా రాశి: ఈరోజు ధనానికి విలువ ఇవ్వండి !
మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలు, పరీక్షలు ఎదురుకొనక తప్పదు. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి. ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. మీ సహుద్యోగుల ఆరోగ్యము క్షీణించటం వలన మీ పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు.
పరిహారాలు: శివాభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
తులా రాశి: ఈరోజు తీసుకున్న అప్పును వెంటనే చెల్లించండి !
మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. కుటుం బంలో ఏవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి, లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు. ఈరోజు, వాతావరణ ములాగా మీ మూడు కూడా అనేక రకాలుగా మారుతుంది.
పరిహారాలుః మంచి ఆర్ధిక ఆదాయాన్ని పొందటానికి శ్రీలక్ష్మీగణపతితోపాటు శివాభిషేకం చేయండి.
వృశ్చిక రాశి: ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోండి !
బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీభాగస్వామి మీ గూర్చి బాగా ఆలోచిస్తారు, దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్ధంచేసుకుని, కోపానికిగల కారణాలు తెలుసుకోండి. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీ కోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.
పరిహారాలుః ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
ధనుస్సు రాశి: ఈరోజు ప్రయాణం వల్ల ఇబ్బందులు !
కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. స్నేహితులతోను, క్రొత్తవారితోను ఒకేలాగ మెళకువగా ప్రవర్తించండి. మీరు ఈరోజు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటినుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్లినప్పటికీ కొన్నివేల ఆలోచనలు మీమెదడును తొలి చివేస్తాయి. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.
పరిహారాలుః నిరంతరం ఆర్థిక వృద్ధి కోసం శ్రీగాయత్రీ మంత్రం పఠించండి.
మకర రాశి: ఈరోజు ధైర్యంగా ఉండండి !
సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకొండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. మీకు ఖాళీసమయము దొరికినప్పటికీ మీరు మీకొరకు ఏమి చేసుకోలేరు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. మీచుట్టూ సరైనవారు, మీఆలోచనలు సరిగ్గా ఉన్నపుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి.
పరిహారాలుః మంచి ఆర్థిక జీవితం కోసం, ఓం శం గం గణపతయే నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి.
కుంభ రాశి: ఈరోజు ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం జాగ్రత్త !
ఈరోజు ప్రారంభంలో మీరు కొన్నిఆర్థిక నష్టాలను ఎదురుకుంటారు. ఇది మీ రోజు మొతాన్ని దెబ్బతీస్తుంది. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖుల తోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశములో లేదా ఇంట్లో దేవుడి గది దగ్గర మీసమయాన్ని గడపటం మీకు మానసికప్రశాంతతను ఇస్తుంది.
పరిహారాలుః ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి పురుషసూక్తపారాయణం లేదా వినడం చేయండి.
మీన రాశి: ఈరోజు ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోండి !
చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. ఈరోజు మీ పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివలన వారు ఈ రోజంత మీ పక్కనే ఉంటారు.
పరిహారాలుః ఆరోగ్యకరమైన జీవితం కోసం గోసేవ, గోవులకు దానాను సమర్పించడం మంచి ఫలితాన్నిస్తాయి.