‘పవర్ స్టార్’ ట్రైలర్‌ @రూ.25..!

-

కొన్నిరోజుల క్రితమే ‘పవర్ స్టార్’ అనే సినిమా ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. జూలై 22న ఉదయం 11 గంటలకు ‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్ డాట్ కామ్’ అనే వెబ్ సైట్లో విడుదల అవుతుందని తెలిపారు. కానీ వర్మ ఈ ట్రైలర్ చూడ్డానికి 25 రూపాయలు కట్టాలని పేర్కొన్నాడు. కాగా ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ కూడా ఇదే.

ఇప్పటికే క్లైమాక్స్, నేక్డ్ అంటూ పోర్న్ సినిమాలకు తక్కువ కానీ కంటెంట్ ఆన్‌లైన్‌లో విడుదల చేసి సొమ్ము చేసుకున్నాడు ఈయన. మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు 100 రూపాయలు టికెట్ పెట్టాడు.. ఆ తర్వాత ‘నేక్డ్’ అనే మరో లోకల్ బూతు సినిమాకు 200 రూపాయలు టికెట్ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ‘పవర్ స్టార్’తో సొమ్ము చేసుకునేందుకు రెడీ అయిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news