ఎల్లుండి నుంచి జూనియర్ డాక్టర్ల డ్యూటీలు బంద్ కానున్నాయి. తమ డిమాండ్లు, తమకిచ్చిన హామీలను రేపటిలోగా ప్రభుత్వం పరిష్కరించాలని… లేదంటే ఈ నెల 11 నుంచి సమ్మె చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.
ఎల్లుండి నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ స్పష్టం చేసింది. విడుదలలో కూడా జాప్యం జరుగుతోందని… నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదని, ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.