పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ …?

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ .అయితే ‘కల్కి’ మూవీలో రోజుకో స్టార్ హీరో వచ్చి చేరుతున్నారు. తాజాగా మరో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరశురాముడి పాత్రలో ఆయన కనిపిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీలో విజయ్ దేవరకొండ, నాని భాగమైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ మూవీ లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగ ,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 9 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.2023 లో శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version