అధికార పార్టీ BRS నుండి బయటకు వచ్చేసిన పొంగులేటి మరియు జూపల్లిల పయనం ఎటన్నది ఈ రోజుతో తేలిపోయింది.. వీరిద్దరూ కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు.. జులై 2న పొంగులేటి రాహుల్ గాంధీ సమక్షములో చేరుతుండగా.. జూపల్లి కృష్ణారావు సైతం జులై 14 లేదా 16వ తేదీన పాలమూరు సభలో కాంగ్రెస్ కండువా పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు, ఈయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీ ఋణం తీర్చుకునే బాధ్యత వచ్చిందన్నారు. ఇప్పుడు కృతజ్ఞత చూపించకపోతే దేవుడు కూడా క్షమించదని భారీ డైలాగ్ చెప్పాడు జూపల్లి.
గత రెండు పర్యాయాలుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నేతకు సరైన బుద్ది చెప్పడానికి మేము కాంగ్రెస్ లో చేరుతున్నామంటూ ప్రకటించాడు జూపల్లి కృష్ణారావు. పాలమూరు సభలో నాతో పాటుగా చాలా మంది జిల్లా నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.