తెలంగాణ ఎన్నికలు కేవలం అయిదు రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మరియు అధికార BRS లు పోటీ చేస్తున్నాయి. కాగా రాష్ట్రం మొత్తాన్ని ఎంతగానో ఆకరిస్తున్న నియోజకవర్గం కొల్హాపూర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి శిరీష అలియా బర్రెలక్క పెద్ద నాయకులతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ మధ్యన ఈమె సోదరుడిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈమె మరింత వైరల్ గా మారింది. ఇక తాజాగా బర్రెల్లక్కకు హై కోర్ట్ కూడా రక్షణ కల్పించాలని పోలీస్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ మాట్లాడుతూ, బర్రెలక్కకు మద్దతు ఇస్తున్నానంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అంతే కాకుండా ఆ నియోజకవర్గంలో బీజేపీ, BRS మరియు కాంగ్రెస్ లకు ఓటు వేయొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు అంటూ విమర్శించారు కె ఏ పాల్.