కాజల్ అగర్వాల్ ఇక కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. ఇన్నాళ్లు హీరోయిన్ గా అలరించిన కాజల్ అగర్వాల్ ఇకపై తల్లిగా మాతృత్వపు కమ్మదనాన్ని పొందనుంది. కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గౌతం కిచ్లూ- కాజల్ అగర్వాల్ జంట తమ జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వనించారు. అంతకుముందు మాతృత్వం గురించి ఇన్ స్టా వేదికగా కామెంట్లు చేసింది కాజల్ అగర్వాల్. మాతృత్వం కోసం సిద్ధ పడటం అందంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ విషయాన్ని గౌతమ్ కిచ్లు- కాజల్ అగర్వాల్ జంట అధికారికంగా వెల్లడించలేదు.
తన బేబీ బంప్ పై ఎన్నో రూమర్స్ వచ్చిన వేళ జనవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు కాజల్ ప్రకటించింది. ప్రెగ్నెన్సీ కారణంగా తన బాడీలో వచ్చిన మార్పుల గురించి నెగిటివ్ గా ట్రోలింగ్ చేసిన వారికి గట్టిగానే సమాధానం ఇచ్చింది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది కాజల్. అక్టోబర్ 30,2020లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిచింది.