Ram Charan: BSFతో రామ్ చరణ్..సోల్జర్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన మెగా పవర్ స్టార్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరో కాదు పాన్ ఇండియా స్టార్..RRR సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ఫిల్మ్ RC15 కూడా పాన్ ఇండియా రిలీజ్ కాగా, ప్రస్తుతం ఆ చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు చరణ్.

అమృత్ సర్ లో ప్రస్తుతం చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ లో రామ్ చరణ్ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ స్టోరి ఉన్నప్పటికీ కమర్షియల్ యాంగిల్ ఎలివేషన్స్ ఉంటాయని టాక్.

ఇకపోతే RRR చిత్రంతో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ను చూసిన పోలీస్, సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్లు ఆయనతో ఫొటో దిగాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమృత్ సర్ లోని ఖాసా ఏరియా బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సోల్జర్స్ ను రామ్ చరణ్ కలిశాడు.

మంగళవారం వారితో కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు. సోల్జర్స్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్..ఎలాగంటే తన వ్యక్తిగత చెఫ్ ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లందరి కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మీల్స్ తెప్పించారు. వారితో కలిసి టైం స్పెండ్ చేసి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

రామ్ చరణ్ చేసిన పని పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్ఎఫ్ సోల్జర్స్ రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక రామ్ చరణ్ తరఫున ఆయన భార్య ఉపాసన అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో లంగర్ సేవలను నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news