Sarkaru Vaari Paata : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న “కళావతి”.. 50 మిలియన్స్ క్రాస్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా నుంచి ఇటీవలే కళావతి అనే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మొదట్లో ఈ సాంగ్ కు పెద్దగా ఆదరణ రానప్పటికీ… తర్వాత రికార్డులను సృష్టించింది.

కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా రాబట్టి కళావతి సాంగ్ హిస్టరీ సృష్టించింది. ఈ సాంగ్ యూట్యూబ్ లోనే కాకుండా ఇంస్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. చాలామంది సినిమా తారలు అలాగే ఇతరులు… సూపర్ స్టార్ మహేష్ బాబు తరహాలో స్టెప్పులేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కళావతి సాంగ్ మరో రికార్డును సొంతం చేసుకుంది.

యూట్యూబ్ లో 50 మిలియన్ల వ్యుస్ న్యూ రాబట్టింది కళావతి సాంగ్. తక్కువ టైం లో 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన సాంగ్ గా కళావతి రికార్డు సృష్టించింది. కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడం గమ నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news