బొగ్గు గనులను ప్రైవేటీకరించడానికి కేంద్రం పావులు కదపడం సరికాదని కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కేంద్రం తీరును తప్పుబట్టారు. బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉరుకునేది లేదని ఉద్యమానికైనా వెనుకాబోయేది లేదని ఆమె తెలిపారు. బొగ్గుగనులను ప్రైవేటీకరిస్తే ఉద్యమం చేయాలని అందుకు తాను సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై రేపు సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ తీర్పును నిరసిస్తూ టిబిజికేఎస్ సమ్మెకు తమ పార్టీ తరఫున అండ ఉంటుందని పార్టీ అనుబంధ టిబిజికేఎస్ బలోపేతంపై కవిత దృష్టి సారించారు. జులై 2 నుండి మూడు రోజుల పాటు సమ్మె చేయాలని జాతీయ కార్మికుల విభాగం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
బొగ్గుగనిలో.. కలవకుంట్ల కవిత..! కార్మిక ఉద్యమానికి నేను సిద్ధం..!
-